మ్యాచ్ ఓడిన తర్వాత మహిళా క్రికెటర్లతో కోహ్లీ

Friday, September 29th, 2017, 09:11:11 PM IST


వరుసగా మూడు వన్డేల ఓటమితో సతమతమైన ఆస్ట్రేలియా ఎట్టకేలకు బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో జరిగిన నాలుగో వన్డేలో గెలిచి పరువు నిలుపుకుంది. అయితే టీమ్ ఇండియా కూడా ఆ మ్యాచ్ లో గెలవడానికి చాలానే పోరాడింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ మ్యాచ్ ను చూడటానికి భారత మహిళ క్రికెటర్లు హార్మన్‌ ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధనలు వచ్చారు.

మ్యాచ్ అనంతరం హార్మన్‌ ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధనలు కెప్టెన్ విరాట్ కోహ్లీని కలిశారు. వారిని కలిసిన కోహ్లీ కొంత సేపు వారితో నవ్వుతూ మాట్లాడాడు. గత ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత మహిళ జట్టు ఫైనల్ కి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ వరల్డ్ కప్ లో వీరిద్దరూ మంచి ప్రతిభను కనబరిచారు. భారత మహిళల క్రికెట్ జట్టును కోహ్లీ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ.. ఉంటారు . ధోని కూడా మిథాలీ రాజ్ టీమ్ తో ఒకసారి కలిసి ఫోటో దిగాడు. అప్పుడు టీ20 వరల్డ్ కప్ సందర్బంగా వారికి కొన్ని టిప్స్ ను కూడా ధోని చెప్పాడు.

  •  
  •  
  •  
  •  

Comments