కోలీవుడ్ లో సినిమా షూటింగులు బంద్‌

Friday, January 20th, 2017, 10:54:39 AM IST

jallikattu
రెండ్రోజులుగా కోలీవుడ్ ప‌రిస్థితి అల్ల‌క‌ల్లోలంగా మారింది. జ‌ల్లిక‌ట్టు వివాదం ర‌చ్చ‌తో షూటింగుల‌న్నీ బంద్ అయిపోయాయి. పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు, విద్యార్థులు రోడ్ల‌పైకి వ‌చ్చి జ‌ల్లిక‌ట్టు నిషేధానికి వ్య‌తిరేకంగా నిన‌దిస్తుండ‌డంతో వీరికి మ‌ద్ద‌తునిస్తూ సినిమావాళ్లంతా రోడ్లెక్కుతున్నారు. మెరీనా బీచ్ లో జ‌నం ఉద్్య‌మిస్తున్నారు. విద్యార్థి సంఘాలు స‌హా ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా పాల్గొంటున్నారు. విజ‌య్‌, క‌మ‌ల్‌హాస‌న్‌, ర‌జ‌నీకాంత్ వంటి స్టార్లు జ‌ల్లిక‌ట్టుకు స‌పోర్టునిస్తూ మెరీనాబీచ్‌కి విచ్చేశారు. ఏ.ఆర్‌.రెహ‌మాన్ అంత‌టివాడు జ‌ల్లిక‌ట్టుకు స‌పోర్టుగా ఇంట్లోనే ధీక్ష‌కు పూనుకుంటున్నారు. మ‌హేష్ వంటి స్టార్లు జ‌ల్లిక‌ట్టుకు మ‌ద్ద‌తు ప‌లికారు.

ఇంత‌టి తీవ్ర‌త ఉంది కాబ‌ట్టి …. కోలీవుడ్లో నిన్న‌టినుంచి షూటింగుల్ని బంద్ చేశారు. సినిమా 24 శాఖ‌ల ప‌నులు ఆపేశారు. ఆన్‌సెట్స్‌కి వెళ్ల‌కుండా కార్మికులంతా బంద్‌ని స్వ‌చ్ఛందంగా పాటిస్తున్నారు. దీంతో రెండో రోజూ కోలీవుడ్ షూటింగులు బంద్ అయ్యాయి. ప్ర‌ధానితో ప‌న్నీర్ సెల్వం మంత‌నాల అప్‌డేట్ ఏంటో తెలియాల్సి ఉందింకా.