ఈ కోమలి అమ్మాయిని గుర్తుపట్టారా?

Tuesday, September 4th, 2018, 11:57:20 AM IST

కోమలి సిస్టర్స్ అంటే అందరికి గుర్తుండే ఉంటుంది. కొన్నేళ్ల క్రితం మిమిక్రీతో తెలుగు రాష్ట్ర ప్రజలను అలరించిన ఈ సిస్టర్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలిస్తే షాకవుతారు.అప్పట్లో వారి మాటల చాతుర్యంతో ఆకట్టుకుంటే ఇప్పుడు అందంతో అందరి చూపును ఆకర్షిస్తున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కోమలి సిస్టర్స్ లో పెద్దమ్మాయి హిరోషిని కోమలి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అమ్మడు ఒక హీరోయిన్ కి ఉండే లక్షణాలన్ని అలవర్చుకుంటున్నాను అని తెలిపింది.

ఆహారం నుండి వ్యాయామాల వరకు జాగ్రత్తలు తీసుకుంటూ నటనలో కూడా శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. అదే విధంగా డ్యాన్స్ పై కూడా ద్రుష్టి పెట్టినట్లు హిరోషిణి తెలిపింది. ఇక గత నాలుగేళ్లుగా మిమిక్రీకి దూరంగా ఉండడానికి కారణం హీరోయిన్ అవ్వాలనే కొరికే అని అందుకోసం కష్టపడుతున్నట్లు వివరించింది. ప్రస్తుతం ఆమెకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సరికొత్త హీరోయిన్ గా నా టాలెంట్ నిరూపించుకోవడమే టార్గెట్ అంటోంది హిరోషిణి. మరి హిరోషిణి టాలీవుడ్ హీరోయిన్స్ కు ఎంతవరకు పోటీని ఇస్తుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments