జగ్గారెడ్డికి ఫోన్‌ కాల్ చేసిన కోమటి రెడ్ది.. ఎందుకో తెలుసా..!

Sunday, June 16th, 2019, 10:00:48 PM IST

కాంగ్రెస్ సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి నిన్న కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పార్టీలో పెద్ద దుమారం రేపుతున్నాయి. మిన్న మీడియాతో మాట్లాడిన కోమటి రెడ్డి ఈ సారి తెలంగాణలో జరిగిన ఎన్నికలలో టీడీపీతో పొత్తు కొంప ముంచిందని అన్నారు. అంతేకాదు చంద్రబాబుతో చేతులు కలపవడం వల్ల కాంగ్రెస్ పార్టీని చేజేతులా నాశనం చేసుకున్నామని ఈ ఎన్నికలలో ఓటమికి రాష్ట్ర నాయకత్వమే కారణమని చెప్పుకొచ్చారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీయే సరైన ప్రత్యామ్నాయం అని దేశమంతా బీజేపీ వైపు చూస్తుందని అని కూడా అన్నారు.

అయితే తాజాగా ఈ రోజు సాయంత్రం సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఫోన్‌ చేసిన ఈయన ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. అయితే నిన్న్ పార్టీపై తీవ్ర విమర్శలు చేయడం నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతుండడంతో ఈ వార్తలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పీసీసీ పదవి ఆశిస్తున్నారని ఆ పదవి రాకపోవడంతోనే ఇలా వ్యవహిరిస్తున్నారని కొందరు భావిస్తుంటే, మరికొందరు మాత్రంత్వరలో ఆయన బీజేపీలోకి వెళ్తున్నరని అందుకే ముందస్తు సూచనలు చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంపై పూర్తి స్పష్టత రావలంటే మాత్రం కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.