పీసీసీ ఎవరికిచ్చినా కలిసి పని చేస్తాం.. క్లారిటీ ఇచ్చిన కోమటిరెడ్డి..!

Friday, June 4th, 2021, 07:11:25 PM IST

తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్ళీ టీఫీసీసీ మార్పు లొల్లి మొదలయ్యిది. మరో వారం రోజుల్లో కొత్త పీసీసీ ఎవరన్న దానిపై హైకమాండ్ నుంచి క్లారిటీ వస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పదవి ఆశిస్తున్న నేతల్లో ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వొద్దని వీహెచ్ వంటి కొందరు సీనియర్ నేతలు బాహాటంగానే వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో టీపీసీసీ రేసులో ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరూ కాసేపు పిచ్చాపాటిగా మాట్లాడుకోవడం ఆసక్తి కనబరిచింది.

అయితే కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన టీకాంగ్రెస్ ముఖ్య నేతలు వెళ్ళారు. ఈ క్రమంలోనే రాజ్ భవన్ దగ్గరకు వచ్చిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్ రెడ్డి కాసేపు పక్కకు వెళ్లి మాట్లాడుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి త్వరలోనే కొత్త టీపీసీసీ చీప్ ఎంపిక ఉంటుందని, ఎవరికి ఆ పదవి దక్కినా అందరం కలిసే పనిచేస్తామని క్లారిటీ ఇచ్చారు. దీంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్ రెడ్డి పీసీసీ విషయంలో ఓ క్లారిటీకి వచ్చారా అనే చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా చాలా కాలంగా వాయిదాపడుతూ వస్తున్న టీపీసీసీ ఎంపిక ఇప్పటికైనా పూర్తవుతుందో లేదో చూడాలి మరీ.