సినీనటులపై కోన కౌంటర్ వేసిన.. కారణం అదేనా ?

Sunday, March 25th, 2018, 11:40:48 AM IST

ఈ మధ్య పలువురు సినీ నటులు రాజకీయ విమర్శలు చేయడం ఎక్కువైందని, ఈ చర్యలను కందించాలని చెబుతున్నాడు రచయిత కోన వెంకట్. తాజాగా ట్విట్టర్ లో అయన స్పందిస్తూ కొందరు సినీ నటులు ఈ మధ్య పొలిటికల్ థియరీస్ ని సినిమాటిక్ గా చెబుతున్నారని విమర్శించారు. పిచ్చిగా అనిపించే విషయాలను కూడా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజమైన రాజకీయంగా నేతలను అటాక్ చేయడం అంత మంచి పద్దతి కాదని, విమర్శలు చేస్తున్న సినీ నటులు ఆలోచనా విధానంలో మరింత ప్రాక్టీకాలిటీ ఉంటె బాగుండేది అని చెప్పారు. నవరస విమర్శలు మానేసి ప్రజా సమస్యలపై ద్రుష్టి పెట్టాలని హితవు పలికారు. మొత్తానికి కోన వెంకట్ చెప్పేది చూస్తుంటే .. ఈ మధ్య హీరో శివాజీ .. ఆపరేషన్ ద్రావిడ అంటూ ఓ దుమారం రేపారు .. దాని గురించే అయ్యుంటుంది.