కర్ణాటక ఫలితాలపై కోన వెంకట్ ఆసక్తికర ట్వీట్ ?

Tuesday, May 15th, 2018, 04:02:19 PM IST

ఇటీవల ఎంతో ఉత్కంఠతతో జరిగిన కర్ణాటక ఎలక్షన్లలో ఏ పార్టీ గెలుపొందనుంది, ఎవరి బలాబలాలు ఏంటో తెలిపే ఫలితాలు నేడు వెలువడనున్నాయి. మొదటినుండి కొందరు మళ్లి అక్కడ కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంటుంది అంటుంటే, మరికొందరేమో మోడీ ప్రభావం కర్ణాటక ప్రజల పై చాలా ఉందని, అక్కడి ప్రజలు ఆయన నేతృత్వంలోనే నడవాలనుకుటనున్నట్లు చెపుతున్నారు. కాగా నేడు ప్రారంభమైన కౌంటింగ్ లో మొదటి నిమిషం నుండి కాంగ్రెస్, బిజెపి మద్యం హోరా హోరీ పోటీ జరిగింది. అయితే కాసేపటికి బిజెపి అభ్యర్థులు ముందుకు దూసుకెళ్లడం మొదలెట్టారు. ఒకరకంగా ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే బిజెపి అక్కడ గెలుపొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దీనిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆ పార్టీకి అభినందనలు తెలుపుతుంటే టాలీవుడ్ రచయిత కోన వెంకట్ అక్కడి ఫలితాలపై ఆసక్తికర ట్వీట్ ఒకటి చేశారు. ఎప్పుడైతే ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అయిందో అప్పుడే అందరికి అర్ధమైంది అక్కడ ఫలితం కూడా ఈవీఎంగా తేలింది అంటూ ట్వీట్ చేసారు. అంటే ఎవ్రిబడి వోటెడ్ ఫర్ మోడీ అని ఆయన ఈవీఎంకు అర్థమొచ్చేలా వ్యాఖ్యానించారు. అయితే తాను మాత్రం దానిపై ఎటువంటి కామెంట్ చేయబోనని తెలివిగా చెప్పి తప్పించుకున్నారు. ఇప్పటికే మంచి సంఖ్యాబలంతో దూసుకెళ్తున్న బిజెపి, మరిన్ని స్థానాలను కైవశం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు……..