పీవీ నరసింహారావు, వైయస్సార్ ల అరుదైన ఫోటో షేర్ చేసిన కోన వెంకట్!

Sunday, June 28th, 2020, 05:14:18 PM IST

నేడు మాజీ ప్రధాన మంత్రి, మన తెలుగు ప్రజల కీర్తి నీ జాతీయ స్థాయిలో ఇనుమడింప జేసిన దివంగత నేత పీవీ నరసింహారావు జయంతి పురస్కరించుకొని కోన వెంకట్ ఒక అరుదైన ఫోటోను ప్రజలతో పంచుకున్నారు. అయితే ఈ ఫోటో లో మన మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కూడా ఉన్నారు. ఆ పక్కనే కోన ప్రభాకరరావు గారు కూడా ఉన్నారు. అయితే వారు ముగ్గురు కూడా ఒకే ఫోటోలో ఉండటం తో వారి అభిమానులు ఈ ఫోటో ను తెగ షేర్ చేస్తున్నారు.