వైకాపాలో చేరేందుకు కొణ‌తాల స‌న్నాహాలు!

Wednesday, November 30th, 2016, 06:40:50 PM IST

Konathala-Ramakrishna1
ఉత్త‌రాంధ్రలో తిరుగులేని నేత‌గా పేరు తెచ్చుకున్న సీనియ‌ర్ నాయ‌కుడు కొణ‌తాల రామ‌కృష్ణ‌. వైయ‌స్సార్‌కి అత్యంత స‌న్నిహితుడిగా, అటుపై వైకాపాలో జ‌గ‌న్ వెంట కీల‌క‌నేత‌గా కొన‌సాగారు. అయితే ఉన్న‌ట్టుండి వైకాపాలోకి తేదేపా నేత దాడి వీర‌భ‌ద్ర‌రావు చేర‌డంతో దానిని త‌ట్టుకోలేక‌పోయారు. అయితే అదే ఊపులో తేదేపాలో చేరేందుకు కొణ‌తాల చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. చంద్ర‌బాబు సైతం చేర్చుకునేందుకు సిద్ధ‌మైనా.. తేదేపాలో మ‌రో సీనియ‌ర్ నేత అయిన గంటా శ్రీ‌నివాస‌రావు అండ్ గ్యాంగ్ వ్య‌తిరేకించ‌డంతో కొణ‌తాల పార్టీ ఛేంజ్ సాధ్య‌ప‌డ‌లేదు. అప్ప‌ట్నుంచి ఆయ‌న ఖాళీగానే ఉన్నారు. అయినా నిరాశ‌ప‌డ‌కుండా కొణ‌తాల ప్ర‌జ‌ల్లో ప్ర‌జా నేత‌గా ప‌లు ఉప‌యుక్త‌మైన కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ మీడియాకి ట‌చ్‌లో ఉన్నారు. ఎట్ట‌కేల‌కు ఇన్నాళ్టికి తిరిగి ఆయ‌న వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధ‌మైంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

ఇప్ప‌టికే జ‌గ‌న్‌తో మంత‌నాలు పూర్త‌య్యాయి. ఏ క్ష‌ణం అయినా ఆయ‌న పార్టీలో చేరే ఛాన్సుంద‌ని తెలుస్తోంది. ఒక‌వేళ కొణ‌తాల కూడా వైకాపాలోకి వ‌చ్చి చేరితో బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన వంటి సీనియ‌ర్ల‌తో పాటు అద‌న‌పు బ‌లం వ‌చ్చి చేరిన‌ట్టు అవుతుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. కాబ‌ట్టి గ‌తాన్ని మ‌రిచి మ‌రో అవ‌కాశం ఇచ్చార‌ని చెబుతున్నారు. అదీ సంగ‌తి.