వైకాపా లోకి కొణతాల ?

Friday, September 30th, 2016, 03:16:31 PM IST

Konathala-Ramakrishna1
తెలుగుదేశం పార్టీలో చేరతా అని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఎప్పుడో ప్రకటించారు. ప్రకటించి చాలా కాలమే అయినా ఈ టైం లో బోలెడు మంది వైకపా నాయకులు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు కానీ కొణతాల మాత్రం ఇంకా మల్ల గుల్లాలు పడుతూనే ఉన్నారు. ఒకే ఒక్క సారి చంద్రబాబు ని కలిసిన కొణతాల టీడీపీ లో చేరడం కోసం భారీ బహిరంగ సభ కి కూడా ప్లాన్ చేస్తున్నట్టు మీడియా తో స్వయంగా చెప్పారు. కానీ అప్పటి నుంచీ ఆయన నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేనే లేదు. టీడీపీలో వర్గపోరు తట్టుకోవడం తనవల్ల కాదని కొణతాలకి అప్పుడే అర్థమయ్యింది. ఇప్పటికే మంత్రులు అయ్యన్న పాత్రుడు – గంటా ల మధ్యన తీవ్ర వివాదం ఉంది. వారిద్దరితోనూ కొణతాల కి గొడవలు ఉన్నాయి. సో టీడీపీ లో జేరడానికి ఆయనకి ఇదే ప్రధాన అడ్డం. ఒకప్పుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్య నేతగా ఓ వెలుగు వెలిగారు కొణతాల రామకృష్ణ. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో కొణతాల తన ఆలోచనల్ని మార్చుకున్నారు. ప్రస్తుతానికి రాజకీయాలలో ఖాళీగా ఉన్నారు. 2019 ఎలక్షన్ లోగా ఏదైనా గట్టి నిర్ణయం తీసుకోవాలి అంటే వైకపా మాత్రమే ఆయనకి చాయిస్ గా కనిపిస్తోంది. మనకి అందుతున్న సమాచారం ప్రకారం జగన్ దగ్గర కి కొణతాల తన సన్నిహితులని పంపించారు అని జగన్ కొణతాల ని సాదరంగా ఆహ్వానించారు అనీ అంటున్నారు. అన్నీ కుదిరితే త్వరలోనే పార్టీ లో కొణతాల కి పెద్ద పోస్ట్ ఏ ఇవ్వచ్చు జగన్.