ప్రభాస్ తో కొరటాల మరో సినిమా… వివరాల్లోకి వెళితే..!

Tuesday, May 1st, 2018, 11:04:42 AM IST

బాహుబ‌లి సినిమాతో ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో ప్ర‌భాస్‌. ప్ర‌స్తుతం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో సాహో చిత్రం చేస్తున్న ప్ర‌భాస్.. జిల్ ఫేం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలోను ఓ సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. అయితే తాజాగా ఫిలిం న‌గ‌ర్‌లో ఓ సేన్షేషణల్ న్యూస్ చక్క‌ర్లు కొడుతుంది. ప్ర‌భాస్‌- కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రూపొంద‌నున్న‌ట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. స్టార్ రైట‌ర్‌గా నిలిచిన కొర‌టాల శివ మిర్చి సినిమాతో హిట్ డైరెక్ట‌ర్‌గా మారాడు.

ప్ర‌భాస్‌- కొరటాల శివ కాంబినేష‌న్‌లో రూపొందిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించి టాలీవుడ్ లో చిరస్తాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రం త‌ర్వాత కొర‌టాల శివ తెర‌కెక్కించిన అన్ని ప్రాజెక్ట్‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ కొట్టాయి. రీసెంట్‌గా మ‌హేష్ ప్ర‌ధాన పాత్ర‌లో భ‌ర‌త్ అనే నేను చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ చిత్రం కూడా సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. అయితే కొర‌టాల శివ త‌దుప‌రి ప్రాజెక్ట్ బాహుబ‌లి హీరో ప్ర‌భాస్‌తో ఉంటుంద‌ని ఫిలింన‌గ‌ర్ టాక్‌. కొద్ది రోజుల త‌ర్వాత ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి క‌థా చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని తెలుస్తుంది. మ‌రి దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. ఇక ప్రభాస్ సాహో చిత్రం ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ చేస్కుంటూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.