భరత్ బిజినెస్ మిస్ చేసుకున్న కొరటాల?

Tuesday, March 13th, 2018, 08:42:36 PM IST


మొదట ఎన్నో కష్టనష్టాలుపడి సినీ పరిశ్రమకు వచ్చిన కొందరు ఎలానో మెల్లగా ఒకొక్కమెట్టు ఎక్కి విజయం సాధిస్తుంటారు. అటువంటి సినీ ప్రముఖులను మనం చూసాం కూడా. అలానే తాము సంపాదించిన డబ్బును కూడా ఇదే పరిశ్రమలో పెట్టుబడి గా పెట్టి ముందుకు సాగుతుంటారు. అయితే సినిమా వ్యాపారంలో మంచి చెడులు జాగ్రత్తగా ఆలోచించి డబ్బు పెడితే లాభాలు గట్టిగా అందుకోవచ్చని ఎక్కువ మంది ముఖ్యంగా కొందరు వారి స్థాయిని బట్టి నిర్మాతలుగా, డిస్ట్రిబ్యూటర్ లుగా కూడా మారుతుంటారు. సాధారణంగా కొందరు దర్శకులు రెమ్యునరేషన్ కాకుండా నైజాం, సీడెడ్ రైట్స్ ఇవ్వండని ముందే అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు.

అసలు విషయానికి వస్తే, రీసెంట్ గా కొరటాల శివ కూడా డిస్ట్రిబ్యూటర్ గా మారాలని ఒక ఆలోచన చేసినట్లు సినీ వర్గాలు చెపుతున్నాయి. ప్రస్తుతం తన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భరత్ అనే నేను సినిమా కృష్ణా, గుంటూరు, వైజాగ్ ఏరియాల హక్కులను కొనుగోలు చేయాలని ఆయన భావించినట్లు సమాచారం. తన దగ్గరి స్నేహితుడు ఒకరితో కలిసి పంపిణి చేయాలనీ అనుకున్నారట. అసలే హీరో సూపర్ స్టార్ మహేష్, అందునా శ్రీమంతుడు కాంబినేషన్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. మొదటి నుంచి కొరటాల ఈ విషయం గురించే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నిర్మాత డివివి.దానయ్య మాత్రం కొరటాలకు హక్కులు ఇవ్వడానికి సున్నితంగా తిరస్కరించారట.

వాస్తవం ఏంటంటే అంతకుముందే నిర్మాత సన్నిహితుడైన ఒక వ్యక్తికి ఆ రైట్స్ అమ్మేశారట. దాదాపు బిజినెస్ కూడా క్లోజ్ అయిపొయింది. ఆ ఏరియాల్లో మహేష్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని కొరటాల బిజినెస్ చేద్దామని అనుకున్నా కొరటాల కోరిక తీరలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ సినిమా ఏప్రిల్ 20న రిలీజ్ కాబోతోన్న విషయం తెలిసిందే….

  •  
  •  
  •  
  •  

Comments