కొరటాల శివ కొత్త ఫార్ములా… అదేనా ?

Saturday, May 5th, 2018, 10:10:38 AM IST

వరుస విజయాలతో టాలీవుడ్ లో క్రేజీ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న కొరటాల శివ అంటే ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు సౌత్ లోను హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం వేచి ఉన్నారు. మిర్చి తో దర్శకుడిగా మారిన ఈయన శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, తాజాగా భరత్ అనే నేను సినిమాలతో ఒకదానికంటే మరొకటి పెద్ద హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు అయన నెక్స్ట్ సినిమా ఏమిటనే ఆసక్తి అందరిలో కలిగింది. కొరటాల కూడా రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాతో ఓ క్యూట్ లవ్ స్టోరీ చేస్తే తన పై ఉన్న ఈ భారీ అంచనాలు కాస్త తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు.

ఈ నేపథ్యంలో అయన ప్రేమకథతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోగా అక్కినేని చిన్నోడు అఖిల్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఫ్యామిలి తో కలిసి విదేశీ టూర్ లో ఉన్న కొరటాల అక్కడినుండి రాగానే ఈ సినిమా స్క్రిప్ట్ పై కూర్చుంటాడట. మరి ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే వరకు ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్సే !!

Comments