మళ్ళీ మిర్చి కాంబినేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా ?

Sunday, April 29th, 2018, 08:40:56 PM IST

మిర్చి .. ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం మిర్చి. దర్శకుడిగా మారుతూ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. ఆ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ దర్శకుడిగా మారాడు. మిర్చి తరువాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, ఇప్పుడు భరత్ అనే నేను అన్ని సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి సూపర్ హిట్స్. భరత్ అనే నేను తరువాత కొరటాల శివ నెక్స్ట్ సినిమా ఎవరితో అన్న ఆసక్తి ఎక్కువైంది. ప్రస్త్తుతం కొరటాల తో సినిమా చేసేందుకు పలువురు స్టార్ హీరోలు వెయిటింగ్. కొరటాల నెస్ట్ సినిమా రామ్ చరణ్ తో కానీ అల్లు అర్జున్ తో కానీ ఉంటుందని టాక్. ఈ సినిమాతో పాటు అయన ప్రభాస్ తో కూడా సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. తనకు దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్ తో మరో సినిమా చేయాలనీ కొరటాల ఆరాటపడుతున్నాడట. సో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఉంటుందని టాక్.

  •  
  •  
  •  
  •  

Comments