బన్నీ విషయంలో ఆ దర్శకుడి ఫోకస్ మారిందా ?

Wednesday, May 2nd, 2018, 07:01:56 PM IST

దర్శకుడిగా కొరటాల శివ వరుస సూపర్ హిట్స్ తో టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. తాజాగా అయన మహేష్ తో తీసిన భరత్ అనే నేను సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని 200 కోట్ల దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమా తరువాత కొరటాల నెక్స్ట్ అల్లు అర్జున్ తో చేస్తాడని వార్తలు వచ్చాయి .. అయితే ఈ విషయంలో దర్శకుడు కొరటాల శివ ఫోకస్ మారిందని, నెక్స్ట్ సినిమా కూడా తన మార్కెట్ దెబ్బతినకుండా ఉండేలా మంచి స్టార్ తో చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ పేరు వినిపించింది. అయితే కొరటాల శివతో సినిమా చేయాలనీ అటు బన్నీ .. ఇటు మెగా కంపౌండ్ మొత్తం గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్నారని కానీ కొరటాల మాత్రం ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేసే ఆలోచనలో లేదని టాక్ !! ఎందుకంటే బన్నీకి సరిపోయే కథ లేకపోవడమనే కారణాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఎల్లుండి విడుదల కానుంది. ఈ సినిమా తరువాత బన్నీ కూడా కొరటాల ఎలాంటి రెస్పాన్స్ కాకపోవడంతో మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తో చేసే అవకాశాలు ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది.

Comments