మెగాస్టార్ కోసం పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న దర్శకుడు ?

Saturday, September 15th, 2018, 09:50:44 AM IST

మెగాస్టార్ తో సినిమా చేయాలనీ ఏ దర్శకుడు అనుకోడు చెప్పండి. అయితే ఇలాంటి అవకాశం కొందరు దర్శకులకు చెప్పకుండా వచ్చేస్తాయి. ఇప్పుడు అలాంటి క్రేజీ అవకాశాన్ని కొట్టేసాడు దర్శకుడు కొరటాల శివ. మిర్చి సినిమాతో క్రేజీ దర్శకుడిగా మరీనా కొరటాల శివ శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ .. లెటస్ట్ గా భరత్ అనే నేను సినిమాలతో టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా సెటిల్ అయ్యాడు. అయన నెక్స్ట్ సినిమా మెగాస్టార్ తో చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మెగాస్టార్ సినిమా కోసం స్క్రిప్ట్ విషయంలో బిజీగా మరీనా కొరటాల చిరంజీవి కోసం ఓ సూపర్ స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నాడట.

ప్రస్తుతం మెగాస్టార్ సైరా సినిమాలో బిజీగా ఉన్నాడు మరో నెలరోజులతో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఆ తరువాత కొరటాల సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ సినిమా సోషల్ మెసెజ్ తో పాటు మంచి కమర్షియల్ హంగులతో ఉంటుందని కొరటాల అంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పై మెగా అభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. త్వరలోనే ఈ సినిమా పై అధికారిక ప్రకటన వెలువడనుంది.

  •  
  •  
  •  
  •  

Comments