ఇప్పటి నుంచి అలాంటి సినిమాలు చేయను: కొరటాల శివ

Friday, April 27th, 2018, 01:25:59 PM IST

సందేశాత్మక చిత్రాలను అందించడంలో టాలీవుడ్ లో ముందుండే దర్శకుడు కొరటాల శివ. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను అందించాయి. మిర్చి నుంచి రీసెంట్ గా వచ్చిన భరత్ అనే నేను సినిమా వరకు అన్ని సినిమాల్లో ఒక మంచి సామజిక అంశాన్ని జోడించి అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. కమర్షియల్ అంశాలతో సోషల్ మెస్సేజ్ ఇవ్వడం కొరటాలకె దక్కిందని స్టార్ హీరోలు సైతం పొగిడేస్తున్నారు.

ఇకపోతే కొరటాల శివ ఈ విషయంపై స్పందిస్తూ.. తనను మరీ అంతా మంచి వాడిని చేయవద్దని సినిమా అనేది పెద్ద వ్యాపారమని అలాగే ఎంతో మంది డబ్బుతో కూడుకున్నదని చెప్పారు. అందువల్ల ప్రతిసారి సందేశాత్మక చిత్రాలంటే వీలుపడదని అభిప్రాయపడ్డారు. కమర్షియల్ అంశాలను దృష్టిలో పెట్టుకొని తాను కథ రాసుకుంటానని ఇక ఇప్పటి వరకు వచ్చిన సినిమా తరహాల్లో కాకుండా డిఫెరెంట్ సినిమాలు చేస్తానని దర్శకుడు కొరటాల శివ చెప్పారు.

  •  
  •  
  •  
  •  

Comments