కొరటాల నెక్స్ట్ సినిమాలో హీరో ఎవరు ?

Monday, February 19th, 2018, 01:27:20 PM IST

వరుస సంచలన విజయాలతో దుమ్ము రేపిన దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా భరత్ అనే నేను చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ నెలతో పూర్తవుతుంది. మహేష్ బాబు ని ముఖ్యమంత్రి గా చూపిస్తున్నాడు కొరటాల. ఇక అయన నెక్స్ట్ సినిమా ఎవరితో అన్న విషయం పై పరిశ్రమలో పలు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ తో నెక్స్ట్ సినిమా చేస్తాడని అంటున్నారు. అది ఇలా ఉండగానే తాజాగా కొరటాల తదుపరి చిత్రం అక్కినేని అఖిల్ తో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయట. నాగార్జున కూడా ఈ కథను విని ఓకే చెప్పాడని అంటున్నారు. మరి ఈ రెండు వార్తల్లో ఏది నిజం అన్న విషయం మాత్రం కన్ఫ్యూజ్ గా ఉంది. కొరటాల నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడు అన్న విషయం పై అయన నోరు మెదపడం లేదు. తన నెక్స్ట్ సినిమా విషయంలో ఎందుకు కొరటాల సైలెంట్ గా ఉన్నదన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొరటాల శివ కోసం స్టార్ హీరోలు క్యూ లో ఉంటె అయన అందరిని కాదని .. అఖిల్ తో ఎందుకు చేస్తాడన్న విషయం పై ఆసక్తిగా చర్చ జరుగుతుంది. మరి ఈ విషయం పై కొరటాల మాట్లాడేవరకు వీటిపై క్లారిటీ రాదు !!