తప్పుడు వార్తలపై సీరియస్ అయిన కోట శ్రీనివాసరావు

Saturday, November 11th, 2017, 02:19:48 AM IST

ప్రస్తుతం రోజుల్లో అతి తెలివిని ఉపయోగించి కొందరు యూట్యూబ్ లో పోస్ట్ చేస్తోన్న వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయని అందరికి తెలిసిన విషయమే. ఎక్కువగా సినీ తారలపై నెగిటివ్ గా ప్రచారాలను చేస్తూ..యూట్యూబ్ లో ఛానెల్ పాపులారిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రీసెంట్ గా ఇదే తరహాలో టాలీవుడ్ సీనియర్ నటుడు కోటశ్రీనివాసరావు పై కూడా ఎవరు ఉహించనటువంటి కథనాలు వెలువడ్డాయి. ఆయన ఆరోగ్యం బాగోలేదని అస్వస్థకు గురయ్యారని కొన్ని రూమర్స్ వచ్చాయి. అయితే ఈ కథనాలపై కోట శ్రీనివాసరావు కండించారు. తప్పుడుగా ప్రచారం చేస్తున్నారని తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని తెలుపుతూ.. తప్పుడు వార్తలను ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానెల్స్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతే కాకూండా తాను కేవలం ఎంపిక చేసుకొన్న చిత్రాల్లో మాత్రమే నటిస్తున్నానని చెబుతూ.. చిత్ర పరిశ్రమల్లో పరిస్థితులు చాలా మారాయని వివరించారు.

  •  
  •  
  •  
  •  

Comments