కరోనా ఎఫెక్ట్ : కొత్తగూడెం ఎమ్మెల్యే కీలక నిర్ణయం…

Tuesday, March 24th, 2020, 07:54:58 AM IST

ప్రస్తుత కాలంలో భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ యావత్ ప్రపంచ దేశాలన్నింటినీ కూడా గజ గజ వణికిస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా కీలకమైన చర్యలను చేపట్టాయి… ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కీలకమైన చర్యలను కట్టడి చేస్తున్నాయి… ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ చర్యలను భయంకరంగా అమలు చేస్తున్నారు. వాటితో పాటే అధికారులందరూ కూడా ప్రభుత్వ చర్యలను అమలు చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కొత్తగూడెం ఎమ్మెల్యే ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. వచ్చే నెల జరగాల్సిన తన మనవరాలి వివాహాన్ని వాయిదా వేశారు.

కాగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మనవరాలి పెళ్లి వచ్చే నెల 4 న జరగాల్సి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొంత కాలం ఈ కరొనవిర్స్ ప్రబల కుండా తీసుకునే చర్యలను పాటించాలనే ఉద్దేశంతో, అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమాల వలన ఈ భయంకరమైన కరోనా వైరస్ వ్యాపిస్తున్న కారణంగా, ఈ పెళ్లిని వాయిదావేసినట్లు సమాచారం. ఈ మేరకు మాట్లాడిన ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు… కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణ పాటించాలని, ప్రభుత్వానికి అందరు కూడా సహకరించాలని మీడియాముఖంగా కోరుకున్నారు.