1.5 మిలియన్ ఓట్లు దక్కించుకోబోతున్న కౌశల్..!

Thursday, September 27th, 2018, 03:13:58 PM IST

తెలుగు ప్రేక్షకులు వీక్షించే బుల్లితెర ప్రోగ్రాముల్లో బిగ్ బాస్ షోది ఒక ప్రత్యేకమైన స్థానమే అని చెప్పాలి.షో ప్రారంభ స్థాయిలోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.ఇప్పుడు కూడా అదే పరంపర రెండో సీసన్ కి కూడా కొనసాగుతుంది.అయితే ఈ షో కి ఎంపిక చేసిన సభ్యుల విషయంలో మాత్రం ముందు ప్రేక్షకులు కాస్త అసహనానికి లోనయ్యారు అనే చెప్పాలి,కానీ ఈ షోలో అందరి కన్నా భిన్నంగా తన తీరుతో ప్రేక్షకులను అధికంగా ఆకట్టుకుంది మాత్రం కౌశలే అని చెప్పాలి.

బిగ్ బాస్ వీక్షకుల్లో కౌశల్ క్రేజ్ ఎలా ఉంది అంటే అన్ ఆఫీసియల్ గా నిర్వహిస్తున్నటువంటి పోలింగ్ లో కూడా లక్షల సంఖ్యలో కౌశల్ ఓట్లు సంపాదించుకుంటున్నారు,ఇప్పటికే కౌశల్ సభ్యుల మిగతా కన్నా ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉన్నాడని తెలుసు,కానీ ఇంచుమించు మరీ 10 లక్షల ఓట్ల తేడాతో ఎత్తులో ఉన్నాడు.ఇప్పటికి ఒక అన్ ఆఫీసియల్ పోలింగ్లో కౌశల్ కు దాదపు 1.46మిలియన్(పద్నాలుగు లక్షల ఆరువేల రెండువందల ఇరవై ఆరు) ఓట్లు నమోదయ్యాయి,ఆ తర్వాతి స్థానంలో నాలుగు లక్షల ఇరవై వేల ఓట్లతో దీప్తి ఉంది అంటే ఇద్దరికీ వ్యత్యాసం పది లక్షలు ఉంది.ఈ సమయంలో కౌశల్ కి 1.5మిలియన్ మార్కుని అందుకోవడం కూడా పెద్ద కష్టమేమి కాదు అనే చెప్పాలి.