27కోట్ల ఓట్లలో కౌశల్ ఒక్కడికే ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా?

Monday, October 1st, 2018, 03:55:25 PM IST

బిగ్ బాస్ బుల్లి తెరపై ఎలాంటి సంచలనాలు రేపిందో వేరే చెప్పక్కర్లేదు,అదే స్థాయిలో బిగ్ బాస్ 2 కూడా నడిచింది.నిన్నటితో బిగ్ రెండో సీసన్ కూడా ముగిసిపోయింది.టైటిల్ ఎవరు గెలుస్తారు అన్న విషయంపై ఒక్కొరికి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.ఈ సారి మాత్రం కౌశలే గెలుస్తాడని అందరూ అందరూ దృఢంగానే గానే నమ్మారు.అందరి అంచనాలకు తగ్గట్టు గానే కౌశల్ తన వన్ మాన్ షోతో బిగ్ బాస్ 2 టైటిల్ సొంతం చేసుకున్నాడు.అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ సీసన్ 2 కి దాదాపు 27కోట్ల ఓట్లు అందరి కంటెస్టెంట్లకు కలిపి నమోదు అయ్యినట్టు తెలుస్తుంది.

ఈ ఓటింగ్లో మొత్తంలో కౌశల్ తో కలిపి 27కోట్ల ఓట్లు రాగా కౌశల్ ఒక్కడికే మాత్రం దాదాపు 12.5కోట్ల ఓట్లు నమోదు అయ్యినట్టు తెలుస్తుంది.అంతమంది కంటెస్టెంట్స్ లో కౌశల్ ఒక్కడికే 12 కోట్ల ఓట్లు రావడం అంటే ఆశామాషీ కాదు.దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు కౌశల్ కి ఏ రేంజ్లో ఫాలోయింగ్ ఉందొ..అంతే కాకుండా కొన్ని అన్ ఆఫిసియల్ పోల్స్ లో కూడా కౌశల్ కు తిరుగులేదు అని నిరూపించుకున్నాడు.ఈ మొత్తం ఓట్లలో చివరి దశకు చేరుకునేసరికి 78 శాతం మార్జిన్ తో కౌశల్ అందనంత ఎత్తులో ఉన్నాడని కూడా వార్తలు వచ్చాయి.ఏది ఏమయ్యినప్పటికీ కౌశల్ మాత్రం తిరుగు లేని విజయాన్ని ఐతే సాధించాడు.