బిగ్ బాస్ షో మీద కౌశల్ సంచలన వ్యాఖ్యలు..!

Thursday, October 4th, 2018, 08:10:01 PM IST

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కౌశల్ మంద తాను బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకి వచ్చిన తర్వాత కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను బయటపెట్టారు.బయటకి వచ్చిన తర్వాత కౌశల్ తన అభిమానులతో తన ఆనందాన్ని పంచుకోవడానికి తన పేస్ బుక్ ద్వారా లైవ్ లోకి వచ్చారు.ఆ లైవ్ లో బిగ్ బాస్ షో గురించి తనకి ఎదురైన అనుభవాలను చెప్పుకొచ్చారు.ఇటీవలే కౌశల్ ని ప్రపంచ పేరు గాంచిన గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు తనని సంప్రదించారని.బిగ్ బాస్ లో తన అఖండ విజయం పట్ల వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు.

బుల్లితెర మీద నడిచే ఒక రియాలిటీ షో తనకి ఊహించని రీతిలో భారీ స్థాయిలో ఓట్లను నమోదు కానింపబడ్డానని వారు తెలిపారని కౌశల్ చెప్పుకొచ్చారు.అంతే కాకుండా తనతో బిగ్ బాస్ ఫైనల్స్ కు చేరుకున్న గీతా మాధురి కన్నా కొన్ని కోట్ల ఓట్ల మార్జిన్ తో ముందుండడంలో వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో కౌశల్ యొక్క స్థాయి ఆకాశాన్ని అంటుతుందనే చెప్పాలి.కౌశల్ తాను ఇప్పుడున్న ఈ స్థితిని ఇలాగే కొనసాగించేందుకు సర్వత్రా కష్టపడతానని తన అభిమానులకు తనకి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వారికి తెలియజేసారు.