క్రిష్‌4, 5 ఒకేసారి సెట్స్‌పైకి!

Thursday, May 24th, 2018, 06:32:10 PM IST

సూప‌ర్‌హీరో సిరీస్ అంటే ఇండియాలో క్రిష్ సిరీస్‌ని గుర్తు చేసుకుంటాం. ఈ ఫ్రాంఛైజీలో ఇప్ప‌టికే మూడు సినిమాలు రిలీజై సంచ‌ల‌న విజ‌యాలు సాధించాయి. ఇప్పుడు ఇదే సిరీస్‌లో క్రిష్ 4, క్రిష్ 5 చిత్రాలు ఒకేసారి సెట్స్‌పైకి వెళ్ల‌నున్నాయ‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి గ‌త ఏడాది కాలంగా ఈ సినిమాలు సెట్స్‌కెళ్లే విష‌య‌మై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న సాగుతోంది. ఇప్ప‌టికీ రాకేష్ రోష‌న్ బృందం క‌థ రెడీ చేయ‌డంలోనే బిజీగా ఉన్నారు. తాజా స‌మాచారం మేర‌కు ఈ సిరీస్‌లో ఒకేసారి రెండు సినిమాలు తెర‌కెక్క‌నున్నాయి. పార్ట్ 4, పార్ట్ 5 రెండిటినీ సైమ‌ల్టేనియ‌స్‌గా తెర‌కెక్కిస్తార‌ట‌. అందుకు త‌గ్గ‌ట్టే పక‌డ్భ ందీ ప్ర‌ణాళిక సాగుతోంది.

ఈసారి సిరీస్‌లోనూ మునుప‌టితో పోలిస్తే మ‌రింత హీట్ పెంచేందుకు క‌థానాయిక‌ల్ని ఎంపిక చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ సిరీస్ సినిమాల్లో క‌త్రిన‌, అనుష్క శ‌ర్మ‌, దీపిక ప‌దుకొన్, జాక్విలిన్ వంటి నాయిక‌లు న‌టిస్తార‌న్న ప్ర‌చారం సాగింది. అయితే రెండు భాగాల్లో న‌టించే క‌థానాయిక‌ల్ని రోషన్లు ప్ర‌క‌టించాల్సి ఉందింకా. 2020 క్రిస్మ‌స్ నాటికి క్రిష్ 4 చిత్రాన్ని రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్‌. ఈ విష‌యాన్ని ఇదివ‌ర‌కూ రాకేష్ రోష‌న్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. హృతిక్ ప్ర‌స్తుతం వికాశ్ బాల్ ద‌ర్శ‌క‌త్వ ంలో `సూప‌ర్ 30` చిత్రంలో న‌టిస్తున్నాడు. గ‌ణిత‌శాస్త్ర‌జ్ఞుడు ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అలానే సూప‌ర్ 30 త‌ర‌వాత సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వ ంలోనూ న‌టించ‌నున్నాడు. ఆ క్ర‌మంలోనే క్రిష్ 4, క్రిష్ 5 చిత్రాల కోసం భారీ ప్ర‌ణాళిక సిద్ధ‌మ‌వుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments