డైరెక్టర్ క్రిష్ తో బలవంతంగా ముద్దు పెట్టించిన శ్రియ

Saturday, December 31st, 2016, 11:44:43 AM IST

krish
నందమూరి బాలకృష్ణ గౌతమీ పుత్ర శాతకర్ణి డైరెక్టర్ క్రిష్ ఆడియో వేడుక లో ఎంత పౌరుషంగా మాట్లాడారో తెలిసిందే. ఈ ఫంక్షన్ లో తెలుగువాడి గొప్పతనం గురించి క్రిష్ మాట్లాడిన మాటలు ఎందరినో ప్రభావితం చేసాయి అన్నది అక్షరాలా నిజం. తాను పెళ్లి చేసుకున్న తరవాత పూర్తిగా షూటింగ్ లో మునిగిపోయాను అనీ సినిమా విషయం లో పడి కొత్తగా పెళ్ళయిన భార్య ని కూడా పట్టించుకోవడం కుదరలేదు అంటూ స్టేజీ మీద ఎమోషనల్ అయ్యారు క్రిష్. తన భార్య కూడా తనని చూసి గర్వించే సినిమా తీసా అంటూ సవాల్ విసిరారు క్రిష్. ఇప్పుడు ఇంటర్నెట్ లో క్రిష్ అతని భార్య కి సంబంధించిన ఒక ఫోటో హల్చల్ చేస్తోంది. ఇందులో క్రిష్ మొహాన్ని గట్టిగా పట్టుకున్న శ్రియ.. ఓ అమ్మాయితో క్రిష్ కి బలవంతంగా ముద్దు పెట్టిస్తోంది. మన దర్శకుడు కొంచెం ఇబ్బందిగా ఫీలవుతున్నా ఫేస్ లో మాత్రం సంతోషం చూపిస్తున్నాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు లెండి.. క్రిష్ భార్య రమ్య. శాతకర్ణి షూటింగ్ సమయంలోనే క్రిష్-రమ్యల వివాహం జరగగా.. పట్టుమని పది రోజులు కూడా గ్యాప్ తీసుకోకుండానే మళ్లీ షూటింగ్ కి వచ్చేశాడు క్రిష్. అంతే కాదు.. భార్యతో కలిసి చాలాభాగం శాతకర్ణి షూటింగ్ కంప్లీట్ చేశాడు క్రిష్.

  •  
  •  
  •  
  •  

Comments