అల్లు అర్జున్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్న దర్శకుడు ?

Wednesday, April 11th, 2018, 12:27:58 AM IST


అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం నా పేరు సూర్య .. నా ఇల్లు ఇండియా సినిమా షూటింగ్ పూర్తీ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నెల 13 న ఈ సినిమాలోని మూడో సాంగ్ ని విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఎవరితో అన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే క్షణం దర్శకుడితో సినిమా ఉంటుందని వార్తలు వస్తుండగా .. మరో వైపు దర్శకుడు క్రిష్ కూడా అల్లు అర్జున్ తో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట. అహం బ్రహ్మాస్మి అనే టైటిల్ తో ఓ సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నటు తెలిసింది. అల్లు అర్జున్ – క్రిష్ ల కాంబినేషన్ లో వచ్చిన వేదం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ అనగానే ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ ఏర్పడింది.

  •  
  •  
  •  
  •  

Comments