పవన్ కోసం దర్శకుల క్యూ .. మూడు సినిమాలు వెయిటింగ్ ?

Thursday, October 26th, 2017, 09:52:24 PM IST

పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం త్వరలోనే విదేశాలకు వెళ్లేందుకు యూనిట్ సిద్ధమైంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా జనవరిలో విడుదల కానుంది. భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమాకు తాజాగా బాటసారి అనే టైటిల్ పెట్టె ఆలోచనలో ఉన్నాడట త్రివిక్రమ్!! ఇక ఈ సినిమా తరువాత పవన్ కోసం దర్శకులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే అయన సంతోష్ శ్రీనివాస్ తో ఓ సినిమా కమిట్ అయినట్టు తెలుస్తోంది. దాంతో పాటు ఏఎం రత్నం నిర్మిస్తున్న సినిమా మరొకటి, దీనికి నేసన్ దర్శకత్వం వహిస్తున్నాడు. దాంతో పాటు తాజాగా దర్శకుడు క్రిష్ కూడా పవన్ కోసం ఓ కథను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది ? ప్రస్తుతం బాలీవుడ్ లో మణికర్ణికా పేరుతొ ఝాన్సీ లక్ష్మి భాయ్ కథను తెరకెక్కిస్తున్న క్రిష్ నెక్స్ట్ సినిమా పవన్ తో చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడట !! త్వరలోనే అయన పవన్ ను కలిసి కథ చెబుతానని అంటున్నాడు. వచ్చే ఏడాది నుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేనందుకు రెడీ అవుతున్న పవన్ ఈ సినిమాలు చేస్తాడా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. చూద్దాం ఏమి జరుగుతుందో.