మరోసారి బాలీవుడ్ సినిమా చేస్తున్న క్రిష్ ?

Thursday, November 3rd, 2016, 04:37:51 PM IST

krish
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తో ”గౌతమి పుత్ర శాతకర్ణి” చిత్రాన్ని రూపొందిస్తున్న దర్శకుడు క్రిష్ .. తన నెక్స్ట్ సినిమాకోసం మరోసారి బాలీవుడ్ వెళ్లనున్నాడు. ఇప్పటికే అయన బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా ”గబ్బర్” చిత్రాన్ని రూపొందించాడు. తెలుగు ”ఠాగూర్” చిత్రానికి రీమేక్ గా రూపొందిన ఈ సినిమా అక్కడ పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ క్రిష్ టాలెంట్ కు మాత్రం బాలీవుడ్ ఫిదా అయింది. దాంతో అక్షయ్ కుమార్ మరోసారి కలిసి సినిమా చేద్దామని చెప్పాడట !! ఇక క్రిష్ .. కూడా తెలుగులో రామ్ చరణ్ తో ”జగదేక వీరుడు”, లేదా వరుణ్ తేజ్ తో ఇదివరకే అనుకున్న ”రాయభారి” సినిమా చేస్తాడని అనుకున్నారు, కానీ ఇప్పుడు క్రిష్ నెక్స్ట్ సినిమా మాత్రం బాలీవుడ్ లో చేయడానికి ఫిక్స్ అయ్యాడు. అక్షయ్ కుమార్ హీరోగానే ఈ సినిమా ఉంటుందని తెలిసింది. ఇక క్రిష్ రూపొందిస్తున్న ”గౌతమి పుత్ర శాతకర్ణి” సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అవుతుంది.