చెర్రీతో క్రిష్..క్రేజీ కాంబినేషన్ గ్యాసేనట..!

Thursday, October 26th, 2017, 09:40:44 PM IST

ఇప్పటికీ నత్త నడకగా సాగుతున్న రంగస్థలం చిత్రం పూర్తి కాక ముందే చెర్రీ తరువాతి చిత్రం గురించి అనేక రూమర్లు పుట్టుకొచ్చేస్తున్నాయి. రంగస్థలం చిత్ర విడుదల గురించే చిత్ర యూనిట్ ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. సంక్రాంతి నుంచి సమ్మర్ కు వెళ్లిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా రామ్ చరణ్ తదుపరి చిత్రం గురించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.

రంగస్థలం పూర్తి కాగానే బోయపాటి దర్శకత్వంలో చరణ్ సినిమా ప్రారంభిస్తాడని అంతా ఓ అంచనాకు వచ్చారు. కానీ తాజగా క్రిష్ సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో క్రిష్ దర్శకత్వంలో చరణ్ నటిస్తాడనేది లేటెస్ట్ గాసిప్. కానీ జరుగుతున్న ఈ ప్రచారంలో ఎటువంటి సత్యం లేదని అది కేవలం కొందరు సృష్టించిన రూమర్ మాత్రమే అని సినీ వర్గాలు అంటున్నాయి. రంగస్థలం పూర్తయ్యాక చరణ్ పక్కాగా బోయపాటి దర్శకత్వంలో నటిస్తాడట. ఈ చిత్రం జనవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments