నరేంద్ర మోడీపై కృష్ణంరాజు ఆసక్తికర కామెంట్స్.!

Sunday, July 7th, 2019, 02:13:38 PM IST

టాలీవుడ్ కు చెందిన చాలా మంది నటుల్లో రాజకీయాల్లో స్థిరపడిన వారు కూడా ఉన్నారు.అలాంటి వారిలో సీనియర్ నటులు మరియు రాజకీయ నాయకుల్లో బీజేపీ పార్టీకు చెందిన నేత అయినటువంటి కృష్ణం రాజు కూడా ఒకరు.అయితే తాజాగా నిర్వహించిన ఒక మీటింగులో కృష్ణం రాజు దేశ ప్రధాని నరేంద్ర మోడీపై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసారు.బీజేపీ నరేంద్ర మోడీ మరియు గతంలో వాజ్ పాయ్ గారి నాయకత్వంలో చాలా పెరిగిందని..

ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ గారి వైపు చూస్తున్నాయని ఎక్కడో పదకొండవ స్థానంలో ఉన్న మనదేశాన్ని ఇప్పుడు టాప్ 5లోకి తీసుకొచ్చారని మరి ముందు ముందు రానున్న రోజుల్లో అమెరికా చైనా తర్వాత మనదేశం మూడవ స్థానంలో నిలిచేలా మోడీ చేస్తారని అది మోడీ గారి గొప్పతనం అంటూ కృష్ణం రాజు ప్రశంసల వర్షం కురిపించారు.ఇతర దేశాల వారు వారి ప్రధానులను మోడీ గారిలా ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారని అది మోడీయిజం అని కృష్ణం రాజు మోడీపై తన అభిమానాన్ని చాటుకున్నారు.