భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న కృతి శెట్టి

Friday, March 5th, 2021, 06:04:56 PM IST

ఉప్పెన చిత్రం తో తెలుగు సినీ పరిశ్రమ లో చెరగని ముద్ర వేసుకున్నారు హీరోయిన్ కృతి శెట్టి. ఉప్పెన చిత్రం కోసం 6 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న ఈ ముద్దు గుమ్మ క్రేజ్ ఆకాశానికి అంటేసింది. తొలి చిత్రం తోనే సూపర్ హిట్ కొట్టడం తో కృతి క్రేజ్ పెరిగిపోయింది. అయితే ఇప్పుడు తన కోసం వస్తున్న నిర్మాతల కు షాక్ ఇస్తున్నారు కృతి శెట్టి. సినిమా కి కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాక డ్రెస్సు ల నుండి, ఆహరం, వ్యక్తిగత సిబ్బంది వరకూ కూడా ప్రత్యేక నిబంధనలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే స్టార్ హీరోయిన్స్ సైతం కృతి శెట్టి పెట్టిన కండిషన్స్ పెట్టలేదట. అయితే చేసేదేమీ లేకపోవడం తో కృతి శెట్టి డిమాండ్స్ కి నిర్మాతలు ఒకే చెప్తున్నట్లు తెలుస్తోంది. దీపం వుండగానే చక్కబెట్టుకోవాలనే తరహాలో కృతి శెట్టి ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.