భామ‌లు కాస్ట్‌లీ : అమ‌లాపాల్ బెంజి .. కృతిస‌న‌న్‌ ఆడి క్యూ 7!

Friday, January 26th, 2018, 02:20:05 PM IST

అందాల క‌థానాయిక‌లు ఖ‌రీదైన కార్లు కొనుక్కుని ఎవ‌రికి వారు కానుక‌లిచ్చుకుంటున్నారు. సోనాక్షి, సోన‌మ్ లాంటి స్టార్లు తండ్రుల‌కు కానుక‌లిస్తే.. అందుకు భిన్నంగా అమ‌లాపాల్‌, కృతి స‌నోన్ లాంటి నాయిక‌లు త‌మ‌కు తామే గిఫ్టులిచ్చుకుని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. అమ‌లాపాల్ మాట‌కొస్తే .. ఈ అమ్మ‌డు ఇటీవ‌లే అత్యంత ఖ‌రీదైన బెంజ్ కార్ కొనుక్కున్న సంగ‌తి తెలిసిందే. ప‌న్ను ఎగ్గొట్టేందుకు కేంద్ర పాలిత ప్రాంతానికి వెళ్లి కార్ కొనుక్కుంది. ఏకంగా 20ల‌క్ష‌ల మేర ప‌న్ను ఎగ్గొట్ట‌డంతో ఆ గొడ‌వ కోర్టు గ‌డ‌ప వ‌ర‌కూ వెళ్లింది. ప్ర‌స్తుతం ఈ కేసు విచార‌ణ‌లోనే ఉంది.

ఇదిలా ఉంటే.. తాజాగా 1 – నేనొక్క‌డినే, దోచేయ్ చిత్రాల క‌థానాయిక కృతి స‌నోన్ అదిరిపోయే ఆడి కార్ కొనుక్కుని త‌న‌కు తాను కానుకిచ్చుకుంది. ఆడి క్యూ7 బ్రాండ్ కార్ కీస్ అందుకుంటూ ఆడి షోరూమ్ ముందు కృతి ఇచ్చిన ఫోజు ప్ర‌స్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఫోటోలు సామాజిక మాధ్య‌మంలో వైర‌ల్‌గా మారాయి. ఇక‌పోతే అమ‌లాపాల్ త‌ర‌హాలో కృతి ప‌న్ను ఎగ్గొట్టింది అన్న గొడ‌వైతే లేదు. ఈ భామ ప్ర‌స్తుతం దిల్జీత్ దోసాంగి స‌ర‌స‌న ఓ సినిమా లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. విశాల్ భ‌ర‌ద్వాజ్ సార‌థ్యంలో వేరొక చిత్రంలోనూ న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతోందిట‌.