ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ పాండ్యా నిర్బంధం…అసలు కారణం ఇదే!

Friday, November 13th, 2020, 06:09:18 PM IST

ముంబై ఇండియన్స్ ఈ ఏడాది కూడా తన సత్తా చాటి సొంత గూటికి ప్రయాణం అయింది. అయితే క్రికెటర్ కృణల్ పాండ్య ను ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం లో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నిర్బందించడం జరిగింది. అయితే ఈ ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ సరైన ధృవ పత్రాలు లేని బంగారం మరియు ఇతర వస్తువులను కలిగి ఉండటం కారణం చేత అతనిని ఆ విమానాశ్రయం లో ఆపివేశారు. అయితే సరైన ఇన్ వాయిస్ లేని కారణం చేత నిర్బందించినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే ఇంకా ఇందుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.