సీఎం కేసీఆర్ పుట్టినరోజుకు కేటీఆర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్..!

Monday, February 10th, 2020, 07:09:19 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజుకు కేటీఆర్ ఒక సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ ఫిబ్రవరి 17న కేసీఆర్ 66వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడని కావున ఆయనకు ఎంతో ఇష్టమైన హరిత హారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, కార్యకర్తలు తమ అధినేత పుట్టిన రోజున కనీసం ఒక మొక్కనైనా నాటాలని ఆ విధంగా కేసీఆర్ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇకపోతే సంతోష్ కుమార్ ఏమో కేసీఅర్ పుట్టిన రోజున ఒక మొక్కను నాటి సెల్ఫీ తీసుకోవాలని అదే మనం ఆయనకు ఇచ్చే గిఫ్ట్ అంటూ వాటినే “సెల్ఫీ విత్ సాప్లింగ్ ఆన్ బర్త్‌డే ఆఫ్ లెజెండ్” అనే హ్యాష్ ట్యాగ్‌కు ట్వీట్ చేయాలని పిలుపునిచ్చారు.