హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం – కేటీఆర్

Tuesday, October 8th, 2019, 03:00:08 AM IST

హూజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఈ సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచాడు. అయితే ఆయన నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలుపొందడంతో హూజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల 21న ఉప ఎన్నిక జరగబోతుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ తరుపున ఉత్తమ్ పద్మావతి, అధికార పార్టీ నుంచి సైది రెడ్డి, బీజేపీ నుంచి కోట రామారావు, టీడీపీ నుంచి చావ కిరణ్మయి, సీపీఎం అభ్యర్ధిగా పారేపల్లి శేఖరరావు, తీన్మార్ మల్లన్న వంటి వారు ముఖ్యంగా బరిలో ఉన్నారు.

అయితే గతంలో కాంగ్రెస్ గెలుచుకున్న స్థానం కాబట్టి అటు కాంగ్రెస్, అధికారంలో ఉన్న టీఆర్ఎస్ రెండు ఈ స్థానం కోసం గట్టిగానే పోటీ పడుతున్నాయి. అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో గెలిచేది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీనే అని, హుజూర్‌నగర్‌కి కాబోయే ఎమ్మెల్యే సైది రెడ్డి అని ముందుగానే తీర్మానించాడు. అంతేకాదు ఇన్నేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ హుజూర్‌నగర్ అభివృద్ధి కోసం ఏమి చేసిందో ప్రజలు ఆలోచించుకోవాలని మీ ఆలోచనే ఈ నెల 24వ తేదిన సైది రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తుందని పిలుపునిచ్చారు. అంతేకాదు హుజూర్‌నగర్ అభివృద్ధి జరగాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు టీఆర్ఎస్ పార్టీ నుచి సైదిరెడ్డికి ఓటు వేసి గెలుపించుకోవలసిందిగా కోరాడు.