ఉత్తమ్ కు కేటీఆర్ షాకింగ్ సవాల్..అది జరగకపోతే రాజకీయ సన్యాసమే..!

Wednesday, January 31st, 2018, 10:53:35 PM IST

మంత్రి కేటీఆర్ సంచలన శపథం చేశారు. టిఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. నడిగడ్డ సాక్షిగా చెబుతున్నా..టిఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా. టి పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సవాల్ ని స్వీకరించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే ఉత్తమ్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని ప్రశ్నించారు.

2019 ఎన్నికలో విజయం సాధించి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.