వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి కేటీఆర్ పోటీ

Thursday, January 19th, 2017, 04:30:06 PM IST

ktr
ఈ మాట చెప్పింది ఎవరో కాదు. స్వయానా టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి. మంత్రి కేటీఆర్ రాబోయే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనేది రేవంత్ రెడ్డి చెప్పేశారు. తెలంగాణా రాష్ట్ర అసంబ్లీ సమావేశాల సందర్బంగా టీటీడీపీ శాసనసభా పక్ష నేత రేవంత్ రెడ్డి కీ మంత్రి కేటీఆర్ కీ మధ్యన సంవాదం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేసారు. రేవంత్ గురించి మాట్లాడుతూ ఏ గూటి చిలక ఆ గూటి పలుకులే పలుకుతుంది అంటూ ఆయన్ని ఆంధ్రా వ్యక్తి గా చూపించారు ఆయన.దీనికి ఒక రోజు ఆలస్యంగా రియాక్ట్ అయ్యారు రేవంత్. అసెంబ్లీ లాబీల్లో మీడియా మిత్రులతో కలిసిన సందర్భంగా మాట్లాడిన రేవంత్.. తనపై చేసిన వ్యాఖ్యకు కౌంటర్ సమాధానంగా చెబుతూ.. ‘ఆ చిలుక అక్కడిదే.. పలుకూ అక్కడిదే’ అంటూ సటైర్ వేశారు. కేటీఆర్ అక్కడి (ఏపీ) వాడు ఎలా అవుతాడన్న సందేహానికి మరింత వివరంగా సమాధానం ఇస్తూ.. ‘ఆయన (కేటీఆర్ ను ఉద్దేశించి) చదువుకుంది గుంటూర్ లో. 371(డి) ప్రకారం.. ఆయనకు ఇక్కడ ఏ పోస్టూ రాదు. ఈ సంగతి ఆయనకూ తెలుసు. అందుకే వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేస్తనన్నడు. అయితే.. గియితే నాకూ.. హరీశ్ కే ఇక్కడ ఛాన్స్ ’ అంటూ చమత్కరించారు.