నాకు బాలకృష్ణ గారే ఎక్కువ ఇష్టం : కేటీఆర్

Thursday, May 24th, 2018, 02:34:22 PM IST

రాజకీయాలతో సంబంధం లేకుండా కేటీఆర్ సెలబ్రటీలతో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటారని అందరికి తెలిసిందే. కొన్ని కార్యక్రమాలలో ప్రతిపక్ష నాయకులతో కూడా ఆయన స్నేహంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే తెలుగు దేశం పార్టీ అంటే తెరాసా నాయకులకు ఏ విధమైన భావన ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే బాలకృష్ణ మాత్రం టీడీపీ లో కీలక నేత అయినప్పటికీ టీఆరెస్ నాయకులతో స్నేహంగా ఉంటారు. కేసీఆర్ – కేటీఆర్ తో ఎప్పటికి టచ్ లోనే ఉంటారు.

రీసెంట్ గా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి సంబంధించి అడ్వాన్స్ డ్ బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్ ప్రారంబోత్సవానికి బాలకృష్ణ కేటీఆర్ ను ఆహ్వానించారు. ఈ ఈవెంట్ లో కేటీఆర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ మీద అభిమానంతోనే నాన్నగారు నాకు రామారావు అని పేరు పెట్టారని అందుకే ఆయన పేరు చెడగొట్టకుండా నిలబెట్టేందుకే ప్రయత్నిస్తానని కేటీఆర్ తెలిపారు. ఇక టాలీవుడ్ లో తనకు ఇష్టమైన హీరో బాలకృష్ణగారే అని చెబుతూ క్యాన్సర్ హాస్పిటల్ గురించి మాట్లాడారు.బసవతారకం హాస్పిటల్ కి ఎదో విధంగా సహాయం చేయాలనీ మా అమ్మ ఇప్పటికి చెబుతుంటారు. వసతులు కల్పించడం గాని ఇతర విషయాలలో ఎదో ఒక విధంగా రోగులకు సహాయం అందేలా చూడాలని వంద సార్లు చెప్పి ఉంటారని తెలిపారు. ఇక సెలబ్రెటీలంతా క్యాన్సర్ పై అవగాహాన పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాపర్టీ ట్యాక్సులను త్వరలోనే రద్దు చేస్తామని మంత్రి కేటీఆర్ వివరించారు.

  •  
  •  
  •  
  •  

Comments