వారెవ్వా కేటీఆర్.. తెరాస నేతలకి ఆదర్శంగా..

Tuesday, September 10th, 2019, 06:02:41 PM IST

తెలంగాణాలో ప్రజలు రోగం భారిన పడకుండా తగు చర్యలు తీసుకొనేలా కేటీఆర్, వైద్య శాఖా మంత్రి ఈటెల తో, జిహెచ్ఎంసీ అధికారులతో సమావేశమైన సంగతి తెల్సిందే. అయితే ఈ సమావేశం లో పలు విషయాలను వెల్లడించారు. దోమల నివారణ, పరిసరాల పరిసశుబ్రత వంటి వాటి పై చర్చించారు. అయితే కేటీఆర్ ప్రగతి భావం లోని తన సొంత నివాసాన్ని స్వయం గా తానే శుబ్ర పరిచారు. దోమల మందు చల్లి. నిల్వ వున్న నీటి పై, మొక్కల పై వున్న నీటి పై నూనె ని చల్లి శుబ్ర పరిచారు. అయితే ఇదే పద్దతిని అధికారులు అందరు ఫాలో అయ్యేలా మార్గదర్శకం గా నిలిచారు కేటీఆర్.

ఈ విషయం లో కేటీఆర్ ప్రజలకు కొన్ని ముఖ్య సూచనలు చేసారు. ఉపయోగించని వస్తువుల ని తొలగించాలని, నీరు నిల్వ వున్నా ప్రాంతాల లో దోమలు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని, పులా మొక్కలు, నీటి తొట్టెల వద్ద నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి అని తెలిపారు. జిహెచ్ఎంసి అధికారులు, మున్సిపాలిటీ సంబంధిత అధికారులు, దోమ నివారణ చర్యలకు సిద్ధం చేసారని వ్యాఖ్యానించారు.