కేసీఆర్ ని సెలవులు అడిగిన కేటీఆర్..

Sunday, September 24th, 2017, 01:44:48 AM IST

తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే దేశంలో ఇప్పుడు చాలా ఫెమస్ అయ్యారు. పక్క రాష్ట్ర ముఖ్య మంత్రులు కూడా కేసీఆర్ తెలివికి ఆయన మాట్లాడే తీరుకు ఫిదా అవుతారు. ఎటువంటి విమర్శలనైనా కేసీఆర్ ఒక్క మాటతో తిప్పి కొట్టగలరు. ఇక అదే స్థాయిలో ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ కూడా ఉండడం ప్రశంసించాల్సిన విషయం. తండ్రి బాటలోనే నడుస్తూ.. రాజకీయాల్లో చాకచక్యంగా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే కేటీఆర్ దసరా సెలవులు తీసుకుంటున్నారట. ఇన్ని రోజులు రాజకీయాల్లో తీరిక లేకుండా గడిపినందుకు కేసీఆర్ ని ఒక వారం పాటు సెలవులు ఇవ్వమని అడగడంతో కేటీఆర్ కి సెలవులను మంజూరు చేశారట. దీంతో వారం రోజులు కుటుంబంతో కలిసి కేటీఆర్ లండన్ కి వెళుతున్నట్లు సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments