వారసత్వంగా కరెంటు కష్టాలు!

Thursday, October 16th, 2014, 03:01:49 PM IST

ktr

తెలంగాణ ఐటి మరియు పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటిఅర్ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమర్స్ ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించి అనంతరం విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విడిపోతే అందరికీ వారసత్వంగా ఆస్తులు వస్తే తమకేమో కరెంట్ కష్టాలు వచ్చాయని పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి కారణం గత ప్రభుత్వ అసమర్ధ పాలనేనని కేటిఅర్ తీవ్రంగా మండిపడ్డారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ విద్యుత్ సమస్యను అధిగమించేందుకు తమ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు. అలాగే 2015 చివరకల్లా ధర్మల్ విద్యుత్ అమలులోకి వస్తుందని కేటిఅర్ పేర్కొన్నారు. అంతేకాకుండా వచ్చే ఏడాది జూన్, జూలై నాటికల్లా వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ను ఉత్పత్తి చేయనున్నట్లు కేటిఅర్ తెలిపారు. ఇక రైతులకు సమస్యలు వస్తే స్థానిక అధికారులను గాని, తెరాస నేతలను గాని కలవాలని మంత్రి సూచించారు. అంతేగాని రైతులు త్వరపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని మంత్రి కేటిఅర్ విజ్ఞ్యప్తి చేశారు.