ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్..!

Thursday, July 30th, 2020, 12:59:49 PM IST

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మొన్న తన పుట్టిన రోజు సందర్భంగా ఆరోగ్యశాఖకు తన వంతుగా ఆరు అంబులెన్స్ వాహనాలను ఇవ్వనున్నట్టు ప్రకటించడంతో మిగతా మంత్రులు కూడా తమ వంతు సహాయంగా కొన్ని అంబులెన్సులు ఇస్తున్నట్టు ప్రకటించారు.

అయితే చెప్పినట్టుగానే నేడు కేటీఆర్ ఆరు కోవిడ్ రెస్పాన్స్ వెహికిల్స్‌ను ఆరోగ్యశాఖకు అందించారు. అయితే ఈ ఆరు వాహనాలను ఆరోగ్యశాఖ మొదట కోవిడ్ రెస్పాన్స్ వెహికిల్స్‌గా వాడుకోనుందని, ఆ తరువాత వాటిని సాధారణ అంబులెన్స్‌లుగా వినియోగిస్తుందని చెబుతూ వాటిని ప్రారంభించారు.