కెటిఆర్ చేతులమీదుగా టీ హబ్ ప్రారంభం

Tuesday, September 9th, 2014, 02:08:36 PM IST


వ్యాపారవేత్తలకు తోడ్పాటు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. వ్యాపారరంగంలో మెళుకువలు నేర్చుకోవాలని అనుకునేవారికోసం తెలంగాణ ప్రభుత్వం ఐఎస్బీ, నల్సార్ సౌజన్యంతో టీ హబ్ ఏర్పాటు చేసింది. ఈ టీ హబ్ ను తెలంగాణ ఐటి మంత్రి కేటీఅర్ ప్రారంభించారు. 15వేల మందికి ఈ టీ హబ్ ద్వారా మెళుకువలు నేర్పనున్నట్లు ఆయన తెలిపారు. ఇండియన్ బిజినెస్ స్కూల్, నల్సార్ మరియు నార్ కామ్ లతో టీ హబ్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆయన తెలిపారు. టీ హబ్ వ్యాపారవేత్తలను తయారు చేసే కర్మాగారంగా మారాలని ఆయన అన్నారు.