ఆర్థికాభివృద్ధిలో మనదే అగ్రస్థానం – కేటీఆర్ కీలక వాఖ్యలు

Friday, October 18th, 2019, 08:12:01 PM IST

శుక్రవారం నాడు హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో జరిగిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైనటువంటి తెలంగాణ మంత్రి కేటీఆర్, అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోమాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. మన తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ది ఎంతో వేగంగా జరుగుతుందని, ఆర్థిక పరమైన అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రానిది అగ్రస్థానమని కేటీఆర్ వెల్లడించారు. అంతేకాకుండా పారిశ్రామిక పరమైన అభివృద్ధిలో, ఆసక్తి చూపుతున్నటువంటి పారిశ్రామికవేత్తలకు సహాయ సహకారాలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లపుడు సిద్ధంగా ఉంటుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

అంతేకాకుండా ఆర్థిక అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలోఉండని, టీఎస్ఐపాస్ ద్వారా 13 లక్షల మందికి ఉద్యోగాలు కలిపించామని, రాష్ట్రంలోని యువతకి అన్ని విధాలుగా సరిపడా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని కేటీఆర్ ఈసందర్భంగా వెల్లడించారు.