హాస్టళ్ళు మూసివేయవద్దు.. కేటీఆర్ కీలక ప్రకటన..!

Wednesday, March 25th, 2020, 10:20:42 PM IST

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో రాష్ట్రమంతా లాక్‌డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. అయితే హైదరాబాద్‌లో హాస్టల్‌ మరియు పేయింగ్ గెస్ట్‌హౌస్ నిర్వాహకులు విద్యార్థులను, ఉద్యోగులను ఖాళీ చేయిస్తుండడంతో విద్యార్థులు, ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే హాస్టళ్లు ఖాళీ చేయించడంతో సొంతూళ్లకు వెళ్ళేందుకు రవాణా సదుపాయాలు లేక కొందరు, ఎన్‌ఓసీల కోసం పీఎస్‌ల ముందు క్యూ కట్టి అవస్థలు పడుతున్నారు. అయితే దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ హాస్టల్, పేయింగ్‌ గెస్ట్‌హౌస్ నిర్వహకులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏ ఒక్కరని కూడా హాస్టళ్ల నుంచి ఖాళీ చేయించవద్దని అన్నారు. ఇప్పటికే ఈ విషయంపై అధికారులతో చర్చించానని ఈ సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.