కేటీఆర్ కి వాట్స్ యాప్ మెసేజ్ పెడితే .. స్పీడ్ గా పనులు

Friday, January 20th, 2017, 02:53:42 PM IST

kcr1
నేతలు ఎవరైనా సరే ఒక చిన్న మాట చెప్తే చాలు ఆ మాట బోలెడంత భరోసాని ఇస్తుంది. అంతకంటే ఏం కావాలి అనిపిస్తుంది. వారి చేతినిండా పవర్ ఉంటుంది కాబట్టి ఇవాళ కాకపోతే రేపు .రేపు కాకపోతే ఎల్లుండి వారు మనకి అండగా ఉంటారు అనేది జనం ఫీల్ అయ్యే మాట. మాట ఇచ్చేసి ఊరుకునే నేతలు కొందరైతే తాము చెప్పినది పాటించే చూపిస్తారు. తెలంగాణా మంత్రులలో తనకంటూ ప్రత్యేకమైన అభిమానం ఏర్పరచుకున్న మంత్రి కేటీఆర్ అందరినీ ఇప్పుడు కొత్తగా ఆకర్షిస్తున్నారు. అధికారులని పరిగెత్తించే కేటీఆర్ సోషల్ మీడియా లో కూడా చాలా చురుకుగా వ్యవహరిస్తారు. సోషల్ మీడియాతో పాటు.. ఆయన వాట్సప్ కు మెసేజ్ పెట్టే వాటి విషయంలోనూ ఆయనెంత పాజిటివ్ గా రియాక్ట్ అవుతారో చెప్పటానికి తాజా ఉదంతమే నిదర్శనం.తాజాగా కేటీఆర్ వాట్సప్ కు ఒక మెసేజ్ వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు లోని రహీంఖాన్ మార్కండేయ చేనేత సహకార సంఘంలో చాలా చీరలు అమ్ముడు కాకుండా ఉన్నాయని.. దీంతో అక్కడి కార్మికులు ఇబ్బందులు పడుతున్నట్లుగా సంఘ అధ్యక్షులు సత్యనారాయణ కేటీఆర్ కు మెసేజ్ పెట్టారు. ఇటీవల కాలంలో చేనేత వస్త్రాలపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. మెసేజ్ రావడం తో దెబ్బకి సహకార సంఘం వరకూ వెళ్ళిపోయినా కేటీఆర్ సమస్యలు పరిష్కరించాలి అంటూ యాదగిరి జాయింట్ డైరెక్టర్ ని ఆదేశించారు.