నిజాలు తెలుసుకొని మాట్లాడండి–కేటీఆర్

Tuesday, December 3rd, 2019, 07:32:12 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మహిళా అధికారులచే విమర్శలకు కారణం అవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ మహిళా కార్మికుల కోసం తీసుకున్న నిర్ణయం తప్పుబడుతున్నారని చెప్పాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులు రాత్రి 8 గంటల కు పనిని ముగించేలా చర్యలు తీసుకున్నారు. అయితే సోషల్ మీడియా లో మాత్రం కేసీఆర్ గారు 8 గంటల లోపు మహిళలు ఇళ్లల్లో ఉండాలి అనేలా నిర్ణయం తీసుకున్నారని కొందరు విమర్శలు గుప్పించారు.

అయితే కేసీఆర్ నిర్ణయం ఫై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి మాటలు విన్నాక షాక్ అయ్యానని తెలిపారు. ఇళ్లల్లో తలుపుల మధ్య ఉంటేనే మహిళలు రక్షణ పొందుతున్నారా? ఇళ్ళల్లో నేరాలు జరగడం లేదా అని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే హక్కులు మహిళలకు సమానంగా వున్నాయి, ఈ విషయాన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి నేర్పాలి అని అన్నారు.

అయితే ఈ విషయాన్నీ ఖండించిన కేటీఆర్ రేఖ శర్మతో ఇలా అన్నారు. మీరు అతి ముఖ్యమైన హోదాలో వున్నారు, ఒకసారి స్పందించే ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడండి అని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పటివరకు అలాంటి ప్రకటన చేయలేదు, కొన్ని మీడియా సంస్థలు టిఆర్పి రేటింగ్ కోసం అర్ధం పర్థం లేని వాటిని ఇలా వ్యాపిస్తున్నారు అని కేటీఆర్ అన్నారు.