కేటీఆర్ చేతికి అందిన నివేదిక – ఏముందంటే…?

Wednesday, September 11th, 2019, 11:44:58 PM IST

తెలంగాణాలో గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ఎట్టకేలకు పూర్తయింది. కాగా రెండవసారి జరిపిన ఈ మంత్రి వర్గ సమావేశంలో కేటీఆర్ మరియు హరీష్ రావు లకు కూడా మంత్రులుగా అవకాశం లభించింది. కాగా ఇకమీదట తెలంగాణాలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై ద్రుష్టి సారిస్తానని కేటీఆర్ అధికారికంగానే ప్రకటించారు. కాగా ఈమేరకు కేటీఆర్, టీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీలు, ఇన్‌చార్జ్‌లతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో కొన్ని కీలకమైన అంశాల కోసం చర్చలు జరిపారని సమాచారం. కాగా ఈనెల 15 నుండి తెరాస పార్టీ మున్సిపల్ ఎన్నికలకు సంబందించిన కార్యాచరణను రూపొందించనున్నారని సమాచారం.

ఇకపోతే మున్సిపాలిటీల్లో పార్టీ మండల, బూత్ కమిటీలతో అన్ని రకాల సమావేశాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు ప్రధాన నేతలు… అందుకోసం మున్సిపాలిటీల్లో తాజా పరిస్థితులను ఇన్‌చార్జ్‌లు అధిష్టానానికి అందజేశారు. అయితే ఆ నివేదికలో చాలా వరకు కూడా తమకే అనుకూలంగా ఉన్నాయని వార్తలు వచ్చినప్పటికీ కూడా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తమ పార్టీ గ్రూపులుగా విడిపోయిందని చెబుతున్నారు. దానికోసం ఇకమీదట తెలంగాణ భవన్ లో పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయాలనీ, ఆలా అయినా పార్టీ పుంజుకుంటుందని వారికోసం పలు ప్రణాళికలను సిద్ధం చేయాలనీ ఇంఛార్జుల అందరికి కేటీఆర్ పలు ఆదేశాలు జారీ చేశారు.