మ‌హిళా నేత‌లు సిగ‌ప‌ట్లు ప‌ట్టేట్టున్నారే!

Wednesday, November 9th, 2016, 05:24:50 PM IST

kushbu-naghma
త‌మిళ రాజ‌కీయాల్లో ఇద్ద‌రు మ‌హిళానేత‌లు ప్ర‌కంప‌నాలు సృష్టిస్తున్నారు. ఈ ఇద్ద‌రూ ముష్ఠిఘాతాల‌తో కొట్టుకునే స‌న్నివేశం వ‌చ్చింద‌న్న విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయ్‌. ఒకే పార్టీలో ఉన్న ఆ ఇద్ద‌రూ ఒక‌రంటే ఒక‌రు రుస‌రుస‌లాడిపోవ‌డం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అస‌లింత‌కీ ఆ ఇద్ద‌రూ ఎవ‌రు? సినిమా క‌థానాయిక‌లు కం పొలిటీషియ‌న్స్‌ న‌గ్మ‌, ఖుష్బూ.

“సినీమాల్లో బొట్టు పెట్టుకుని నటించవచ్చు కానీ.. నిజ‌ జీవితంలో అలా ఏ ముస్లిమ్ యువ‌తి చేయొద్దని చెబుతూ… హిందూ వ్యక్తిని వివాహం చేసుకున్న వాళ్లకు ముస్లిం చట్టాల గురించేం తెలుసు?“ అంటూ న‌గ్మ వ్యాఖ్యానించ‌డం పెను సంచ‌ల‌న‌మైంది. ఆ మాట‌లు కుష్బును ఉద్దేశించి అన్న‌వే. “మార్నింగ్‌ నిరసనకు హాజరైన వాళ్లకు సాయంత్రం జరిగిన సమావేశానికి వచ్చే తీరిక లేదా?“ అంటూ మ‌రో పంచ్ వేశారు న‌గ్మ‌.

అయితే ఈ మాట‌ల్ని నేను “క‌ళ్ల‌తో చూడ‌లేదు.. చెవుల‌తో విన‌లేదు“, అయినా సాయంత్రం స‌మావేశానికి పిలుపే రాలేదు. షూటింగ్ గ్యాప్‌లోనే మోనింగ్ కార్య‌క్ర‌మానికి ఎటెండ్ అయ్యానంటూ.. చాలా సింపుల్‌గా టాపిక్‌ని క‌ట్ చేసేశారు ఖుష్బూ. దీంతో ఆ ఇద్ద‌రి లుక‌లుక‌ల‌పై త‌మిళ‌నాట విస్త్ర‌తంగా చ‌ర్చ సాగుతోంది. మ‌హిళా కాంగ్రెస్ స‌మావేశంలో ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య గొడ‌వ రాజుకుంద‌ని చెప్పుకుంటున్నారు. త‌మిళ కాంగ్ర‌స్‌తో పాటు మీడియాలోనూ ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల‌పై టాక్ న‌డుస్తోంది.