ఆ మాట అనగానే వచ్చేశా.. మళ్లీ అతని దగ్గరికి వెళ్లను : కుష్బూ

Saturday, January 20th, 2018, 05:03:19 PM IST

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి కొన్నాళ్లకే అగ్రతారగా వెలిసిన నటి కుష్బూ. ఆమె అందానికి అప్పట్లో చాలా మంది ఫిదా అయ్యేవారు. అభిమానంతో కొందరు ఆమెకు గుడి కూడా కట్టించారు. అయితే ఆ స్థాయిలో ఫ్యాన్స్ ను గెలుచుకున్న కుష్బూ ఒకానొక సందర్బాల్లో తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయట. చాలా వరకు ఆమె ఎవరైనా విమర్శలు చేస్తే చాలా స్ట్రాంగ్ గా కౌంటర్లు వేయడం అప్పుడపుడు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం.

ఏ మాత్రం బాయపడకుండా కుష్బూ తీసుకునే నిర్ణయం అస్సలు వెనక్కి తీసుకోదట. ఒక్కసారి తనకు నచ్చలేదు అంటే మళ్లీ ఆ పని చేయను అలాగే నచ్చని వారి మొహం చూడను అని ఇండియాటుడే కాన్‌క్లేవ్‌లో గుర్తు చేసుకున్నారు. ఇక ఉదాహరణకు తనకు జరిగిన ఒక ఘటన గురించి కూడా ఆమె వివరించారు. 1986 సెప్టెంబరు 12వ తేదీన తన తండ్రితో చాలా పెద్ద గొడవయ్యిందని చెప్పింది. బిక్షాటన చేసి డబ్బు తీసుకురా అని మా నాన్న అన్నపుడు వెంటనే అమ్మని సోదరుడిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయా. వారిని చంపేసి నేను ట్రైన్ కింద పడతాను గాని మళ్లీ ని దగ్గరకీ రానని గట్టిగా చెప్పినట్లు వివరించింది. అంతే కాకుండా ఆయనను మళ్లీ కలవలేదని కలవను కూడా అని కుష్బూ తెలిపింది.